HOME » VIDEOS » Telangana

Video : కాకతీయ కెనాల్ లో కారు బోల్తా.. దంపతులు మృతి

తెలంగాణ19:22 PM January 25, 2020

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గూనూర్ వద్ద కాకతీయ కెనాల్ లో కారు బోల్తా పడి దంపతులు ఇద్దరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా సూల్తానాబాద్ మండలానికి చెందిన మాచర్ల శ్రీనివాస్, స్వరూప దంపతులు సూల్తానాబాద్ లో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుండి వస్తుండగా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామం వద్ద చేరుకొగానే కెనాల్ పక్కన చేపలను కొనేందుకు అగారు. అనంతరం కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదశాత్తు కాలువలో పడిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొంత దూరం వరుకు కారు కొట్టుకుపోయింది. అనంతరం నీటిలో మునిగింది. స్థానికులు ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోవడంతో దంపతులు మృతి చెందారు. వారిని కరీంనగర్ ప్రధాన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికుల సహయంతో కారును బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories