HOME » VIDEOS » Telangana

Video : కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు గల్లంతు

తెలంగాణ19:10 PM October 26, 2019

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు (AP 0l Q 0418) అతి వేగంతో అదుపుతప్పి కడెం ప్రధాన కాలువలోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా నీట మునగడంతో అందులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రేవోజీపేట్ వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికులు తాళ్ల సాయంతో కారును బయటకు తీశారు. గల్లైంతన యువకులను జన్నారం మండల కేంద్రానికి చెందిన శశాంత్ (25), సాయి సంగీత్ (26)గా గుర్తించారు. వీరు వరసకు బావా మరుదులు. దీపావళి పండగ సందర్భంగా ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు కాలువలో పడింది. గల్లైంతన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. వారం రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. గత శుక్రవారం నడిగూడెం మండలం చాకిరేవు వద్ద సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు చనిపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో కారులోనే కన్నుమూశారు. ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు నీటిలో మునిగిన కారును బయటకు తీశారు.

webtech_news18

Top Stories