హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : లంచం సొమ్ము వాపస్... మీరు చదివింది నిజమే...

తెలంగాణ13:24 PM January 09, 2020

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగిందీ అద్భుతం. ఓ రైతు దగ్గర విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) తీసుకున్న లంచం సొమ్మును కలెక్టర్ తిరిగి వెనక్కు ఇప్పించారు. భూమి పట్టా కోసం రైతు దగ్గర రూ.10 వేలు లంచం తీసుకున్నాడు VRO రమేష్ రెడ్డి. డబ్బు తీసుకున్న VRO పని మాత్రం చెయ్యలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టా ఇవ్వడే. ఇక లాభం లేదనుకున్న ఆ రైతు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాడు. తను పడిన బాధలు, కష్టాలూ అన్నీ చెప్పుకున్నాడు. కంప్లైంట్ ఆధారంగా కలెక్టర్ శరత్... VROని పిలిచి... ఏంటి విషయం అని అడిగారు. మేటర్ అర్థమైంది. వెంటనే రైతును పిలిపించి... లంచం సొమ్మును వాపస్ ఇప్పించారు. అంతేకాదు... ఆ VRO, VRAను సస్పెండ్ చేశారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం రెండూ నేరాలే. ఈసారి ఎవరైనా ఇలా చేస్తే... ఉన్నతాధికారులకూ, ఏసీబీకీ కంప్లైంట్ ఇవ్వాలని ప్రజలకు తెలిపారు కలెక్టర్.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading