HOME » VIDEOS » Telangana

Video: పార్క్‌లో బెంచి పడి బాలుడు మృతి..వీడియో వైరల్

తెలంగాణ15:05 PM April 26, 2019

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పార్కులో సరదాగా ఆడుకుంటూ..ఆరేళ్ల బాలుడు నిశాంత్ చనిపోయాడు. రాజేంద్రనగర్‌లోని హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. గురువారం అపార్ట్‌మెంట్‌లోని పార్కులో సిమెంట్ బెంచిపై కూర్చొని నిశాంత్ ఆడుకున్నాడు. కూర్చొని అటూఇటూ ఊగడంతో బెంచి కిందపడిపోయింది. బరువైన ఆ బెంచి బాలుడి మెడపై పడడంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. వెంటనే అక్కుడున్న వారు సిమెంట్ బెంచ్‌ని పైకి లేపారు. తలకు తీవ్ర గాయం కావడంతో నిశాంత్ చనిపోయాడు. విరిగిపోయిన సిమెంట్ బెంచ్ ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

webtech_news18

Top Stories