బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో రాజాసింగ్ కూడా ఉన్నారు. రౌడీ షీటర్స్ లిస్టులో ఆయన పేరును చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తన పేరును రౌడీ షీటర్స్ జాబితాలో కొనసాగిస్తున్నారని.. ఇదీ తెలంగాణ పోలీసుల అసలు నైజమని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు రాజాసింగ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రౌడీ షీట్ వేసే దమ్ముందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.