హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. గోషామహల్ పరిధిలోని చందన్వాడీలో ఓ భవనం కూలిపోయింది. పక్కింట్లో అక్రమంగా సెల్లార్ తవ్వడంతో ఆ భవనం భూమిలోకి కుంగిపోయి కూలిపోయింది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ సందర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణాలు, కూల్చివేతలు జరుగుతున్నాయని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.