భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని గురువారం నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భద్రచలంకు చేరుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఎం.వి. రెడ్డి, ఆలయ ఈవో నర్సింహులు మంత్రికి పుష్రగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి అల్లోల, ప్రభుత్వ సలహాదారు రమణాచారి అధికారులతో చర్చించారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు లేకుండానే పూజారులు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం టీవీలో ప్రసారం కానుంది.