కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. శంకరపట్నం మండలం మోలంగుర్లో ఎలుగుబంటి సంచరించింది. అర్ధరాత్రి గ్రామంలో ఓ భల్లూకం చెట్టు ఎక్కింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు, రంగంలో దిగి ఎలుగుబంటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అధికారులు. అయినాసరే వలను చేధించుకొని ఎలుగుబంటి పారిపోవడంతో... గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.