నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడవ రోజైన ఈ రోజు.. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో వేకువ జాము నుండే అమ్మవారి దర్శనానికి అక్షరాభ్యాసాల కోసం భక్తులు బారులు తీరారు. ఈరోజున శ్రీ జ్ఞనసరస్వతీ అమ్మవారు కాళ రాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిద కూరగాయలతో తయారుచేసిన కిచిడీ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు.