కశ్మీర్ అంశంపై ట్రంప్‌తో మోదీ మాట్లాడడాన్ని ఎంఐఎం అధినేత తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్యని... అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడితో చర్చించాల్సిన అవసరమేంటని ఆయన విమర్శించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేయడానికి అసలు ట్రంప్ ఎవరని ఓవైసీ మండిపడ్డారు.