హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. మెహిదీపట్నంలో వందలాది మంది రోడ్లపైకి చేరుకొని సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.