మెట్రో సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. శనివారం మియాపూర్ నుంచి ఎల్బీనగర్కు వెళ్తున్న మెట్రో ట్రైన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాగుట్ట దగ్గర ఆ ట్రైన్‌ను దాదాపు 27 నిమిషాల పాటు ఆపేశారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు కాసేపు ఇబ్బంది పడ్డారు.