హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బంకుల్లో కల్తీ పెట్రోల్.. సగం నీళ్లే...

తెలంగాణ16:27 PM September 25, 2019

పలు పెట్రోల్ బంకుల యజమానులు వాహనదారులను నిండా ముంచుతున్నారు. ఇప్పటికే మీటర్ ట్యాంపరింగ్‌తో తక్కువ పెట్రోల్ పోస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు పెట్రోల్‌ను కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. మెదక్ ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ బయటపడింది. బాటిల్‌లో పెట్రోల్ పోయించుకుంటే.. అందలో సగం నీళ్లే కనిపించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐతే పెట్రోల్ ట్యాంకుల్లోకి వర్షపు నీరు చేరడంతో ఇలా జరిగి ఉంటుందన్న అభిప్రాయలూ వినిపిస్తున్నాయి.

webtech_news18