HOME » VIDEOS » Telangana

Video: ఉట్నూర్ ఐటీడీఏ వద్ద ఆదివాసీల మహాధర్నా...

తెలంగాణ20:10 PM February 03, 2020

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లోని నలుమూలల నుంచి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉట్నూర్ ఐటిడిఏ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ ఆద్వర్యంలో ఆదివాసులు మహాధర్నా చేపట్టారు. ఈ మహా ధర్నా లో ఆదివాసులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తమ ప్రదాన డిమాండ్లైన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, అటవీ నిర్వాసితుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006 ను పకడ్బందీగా అమలు చేయాలని, తొమ్మిది తెగల ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అడవిలో తవ్వుతున్న కందకాలను వెంటనే ఆపాలని, నాన్ ఏజెన్సీ ఆదివాసీ గూడాలను, గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని, టీఆర్టీ ఉద్యోగాలు తొమ్మిది తెగల ఆదివాసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఈ ధర్నా చేపట్టామని తొమ్మిది తెగల ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు చెప్పారు.

webtech_news18

Top Stories