HOME » VIDEOS » Telangana

Video : తహశీల్దార్ లావణ్య ఇంట్లో ఏసీబీ తనిఖీలు

తెలంగాణ12:47 PM July 11, 2019

రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న ఆమె.. ఇప్పుడు అవినీతి కేసులో బుక్ కావడం గమనార్హం. ఓ రైతు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం అతని వద్ద నుంచి లంచం తీసుకుని పట్టుబడిన వీఆర్వో ద్వారా లావణ్య అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్య ఇంట్లో ఏసీబీ అధికారులు భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు,విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం వీఆర్వో అనంతయ్య ఎకరానికి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అలా 9 ఎకరాలకు రూ.9లక్షలు ఇస్తేనే పని జరుగుతుందన్నాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అనంతయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే తాను తీసుకున్న లంచంలో కేశపట్నం తహశీల్దార్ లావణ్యకు కూడా వాటా ఉందని అధికారులతో చెప్పడంతో.. ఆమె ఇంట్లోనూ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నగదు, ఆభరణాలు గుర్తించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

webtech_news18

Top Stories