హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన అవినీతి అధికారి..

తెలంగాణ17:46 PM December 16, 2019

లంచం తీసుకుంటూ మరో అధికారి ఏసిబి అధికారులకు చిక్కాడు. నాల కన్సర్షన్ కోసం ఓ రైతు వద్ద నుండి డెబ్భై ఐదు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం వంకాయగుడెం లో రెండు ఎకరాల ఇరవై గుంటలు నాల కన్వర్షన్ కోసం ఎడ్ల జోగి రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. శంకరపట్నం మండల తహశీల్దార్ ముప్పై వేలు తీసుకొని హుజూరాబాద్ అర్ డి ఓ కార్యాలయానికి ఫైల్ పంపించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అర్ డి ఓ కార్యాలయం చుట్టూ గత రెండు నెలల నుండి తిరుగుతుంటే అర్ డి ఓ కార్యాలయం లో పని చేసే సందీప్ ను కలవమని అర్ డి ఓ చెప్పాడని బాధితుడు చెప్తున్నాడు. అనంతరం సందీప్ ను కలువగా రెండు లక్షలు డిమాండ్ చేశాడని చివరికి లక్ష రూపాయలు ఒప్పుకున్నాడని బాధితుడు వాపోయాడు. దీంతో జోగి రెడ్డి ఏ సి బి అధికారులను ఆశ్రయించి డెభై వేలు లంచం ఇస్తుండగా ఏ సి బి అధికారులు పట్టుకున్నారని తెలియజేసాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading