HOME » VIDEOS » Telangana

Video : తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం... తీవ్ర ఉద్రిక్తత... అరెస్టులు

తెలంగాణ13:20 PM March 11, 2020

Telangana : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవట్లేదంటూ... అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. అది గమనించిన పోలీసులు అలర్టయ్యారు. ఒక్కసారిగా వచ్చిన విద్యార్థులను అసెంబ్లీ దరిదాపుల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చూశారు. ఐతే... విద్యార్థులు మెరుపు వేగంతో... దూసుకొచ్చారు. అసెంబ్లీ గేటు ఎక్కి దూకేందుకు కొందరు ప్రయత్నించారు. బారికేట్లను పక్కకు నెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. ఇలా ఎవరికి వాళ్లు గట్టిగానే ట్రై చేశారు. అటు పోలీసులు కూడా అంతే గట్టిగా వారిని అడ్డుకున్నారు. ఆ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది విద్యార్థులు అక్కడే బైటాయించి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... పోలీసులు ఇక లాఠీలు బయటకు తీశారు. బారికేడ్లపై నుంచీ, గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులను బలంగా అడ్డుకున్నారు. చాలా మంది అమ్మాయిలు కూడా అక్కడే పడుకొని ధర్నా చేస్తుంటే... మహిళా పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచీ వ్యాన్లలో తరలించారు. ఇలా ఏబీవీపీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

webtech_news18

Top Stories