HOME » VIDEOS » Telangana

నిజామాబాద్ జిల్లాలో సుందర జలపాతం.. చూసి తీరాల్సిందే..

తెలంగాణ14:40 PM October 02, 2019

దట్టమైన అటవి ప్రాంతంలో నీటి ధారలు. పైనుంచి కిందకు జాలు వారుతున్న జలాలు.. చూసేందుకు తరలి వస్తున్న ప్రకృతి ప్రేమికులు.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడుపుతున్న ప్రజలు.. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని కోరుతున్న స్థానికులు.. మీకు కూడా చూడాలని ఉందా.. అయితే నిజామాబాద్ జిల్లాకు వెల్లాల్సిందే.. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అందులో భాగంగా ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి జానకీబాయి చెరువు అలుగు పోస్తుంది. చెరువు అలుగు 42 మీటర్ల ఎత్తులో ఉంది. చెరువు నిండి పైనుండి పొర్లుతున్న నీటిని చూస్తుంటే కుంటాల జాలపాతాన్ని తలపిస్తుంది.

webtech_news18

Top Stories