HOME » VIDEOS » Telangana

Video : తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం.. గాంధీ ఆసుపత్రిలో మహిళ మృతి

తెలంగాణ18:33 PM February 24, 2020

SWINE FLU: స్వైన్‌ఫ్లూతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. స్వైన్‌ ఫ్లూ కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమెకు గాంధీ వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హఠాత్తుగా గుండెపోటు రావడంతో గర్భిణి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆమె గర్భిణి కావడంతో, ఆమె చనిపోయిన వెంటనే ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు వివరించారు. కాగా కరీంనగర్‌కు చెందిన షహనాజ్‌కు స్వైన్‌ ఫ్లూ వ్యాధి వ్యాపించడంతో తొలుత వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి ఐసియులో ఆమె చికిత్స పొందుతుండగా గుండె పోటు రావడంతో ఆమె చనిపోయారు. మహిళ మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ ఘటనపై అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి కారణంగా మరణం నమోదు కావడంతో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రులను సూచించింది.

webtech_news18

Top Stories