హోమ్ » వీడియోలు » తెలంగాణ

బావిలో పడ్డ స్ట్రీట్ డాగ్ ను రక్షించిన డిఆర్ఎఫ్ బృందం | NDRF team rescued a street dog

తెలంగాణ09:34 AM October 17, 2019

గత మూడు రోజులుగా లోతైన నీటి గుంటలో పడి చావు బతుకుల్లో ఉన్న వీధి కుక్కను సురక్షితంగా జీహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందం కాపాడిన సంఘటన యాప్రాల్ లో జరిగింది. వివరాలకు వస్తే, యాప్రాల్ లో పాడు పడిన బావి ఇటీవల వర్షాలకు పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ వర్షపు నీటి గుంటలో గత మూడు రోజుల క్రితం ఒక వీధి కుక్క ప్రమాదవశాత్తు పడిపోయిందని, దీనిని రక్షించాల్సిoదిగా జి హెచ్ఎంసి డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందిన వెంటనే సమీపంలోని డిజాస్టర్ రెస్క్యూ బృందం గత రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుంది. లోతుగా ఉoడి నిరుపయోగంగా ఉన్నఆ బావిలో ఒక మూలకు ఉన్న కుక్కను గమనించారు. తమ వద్ద ఉన్న నిచ్చెన సహాయంతోఆ బావి లోకి వెళ్లి పూర్తిగా నీరసించిన ఆ కుక్కను డి ఆర్ ఎఫ్ బృందం సురక్షితంగా బయటికి తీసిoది. గత రెండు రోజులుగా ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా పూర్తిగా నీరసించిన ఆవీదీ కుక్కను వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కేవలం ఒక ఫోన్ కాల్ తో వెంటనే స్పందించి రాత్రివేళల్లో ను వీధి కుక్కను రక్షించిన డి ఆర్ ఎఫ్ బృందాన్ని, మూగజీవాల పట్ల వారికున్న కారున్యాన్ని యాప్రాల్ వాసులు అభినందించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading