మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదులబాద్ గ్రామంలో.. ఓ అట్టల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ మంటలకు ఓ డీ.సీ.ఎం వాహనం ఆహుతైనట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకొన్న అగ్ని మాపక శాఖ సిబ్బంది ..మంటల్నీ ఆర్పుతున్నారు. సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగుంటుందని ప్రాధమిక అంచనా వేస్తున్నారు అధికారులు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.