చిన్న జీయర్ స్వామికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన నిన్న వైకుంఠ ఏకాదశి సందర్బంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజకు హాజరైయారు. ఆలయ శిఖరంపై కళశంకు పూజ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆయన నిల్చున్న పందిరి బరువు తట్టుకోలేక కూలింది. దీంతో అక్కడే ఉన్న భక్తులు ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదంలో చిన్న జీయర్ స్వామి, సహచర స్వాములు క్షేమంగా బయటపడ్డారు.