నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లికి చెందిన రఫత్ మరుగుజ్జు. అతడు అందరి పిల్లల్లా ఎత్తు పెరగలేడు. అందరిలా పరిగెత్తలేడు. కానీ చదువు, ఆటల్లో తన తోటి స్నేహితులతో పోటీ పడతాడు. కబడ్డీ కూత పెట్టినా.. కూతతో తన దగ్గరికి ఎవరైనా వచ్చినా పట్టు పడితే ఉడుంపట్టులా విడిచిపెట్టడు.