HOME » VIDEOS » Telangana

కలకలం రేపుతోన్న శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ పిల్లల కిడ్నాప్‌..

తెలంగాణ13:48 PM August 02, 2019

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కిడ్నాప్ యత్నం కలకలం రేపుతోంది. ముంబై నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు వస్తోంది. అందులో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఆ కుటుంబం ఇంటికి వెళ్లేందుకు రెండు వేర్వేరు క్యాబ్స్‌ను బుక్ చేసుకుంది. ఆ రెండు క్యాబ్‌ల్లో ఓ దానిలో పిల్లలు, మరో దానిలో  పేరెంట్స్ బయలు దేరారు. అయితే పిల్లలున్న క్యాబ్ డ్రైవర్.. ఆ కారును స్పీడుగా తీసుకెళ్తూ.. పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన మరో కారులో వస్తున్న తల్లిదండ్రులు వెంబండించి డ్రైవర్‌ను పట్టుకున్నారు.  అంతేకాకుండా  శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆ క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు కూడా చేశారు.

webtech_news18

Top Stories