HOME » VIDEOS » Telangana

Video: ఎమ్మార్వో ఆఫీసులో రైతుల ఆత్మహత్యాయత్నం

తెలంగాణ20:48 PM September 20, 2019

ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం బెజ్జురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. తండ్రి పేరిట ఉన్న ఆస్తిని రెండు భాగాలుగా పంచకుండా.. మొత్తం భూమిని తన వదిన పేరిట పట్టా చేశారని ఫకీర్ అనే రైతు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగాడు. తన వాటాను ఇవ్వకుండా అడ్డుపడుతోందని అధికారులకు చెప్పాడు. తమ తండ్రి చెబుతున్నా ఆమె వినడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరాడు. ఐతే రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో తండ్రి మూఖ్యతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు.

webtech_news18

Top Stories