ఓవైపు రోజూ రకరకాల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే... అయ్యో పాపం అనుకుంటున్నాం. ఇలాంటప్పుడు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కనిపించిన దృశ్యం చూస్తే షాకే. ఈ నెల 8న జరిగిందీ ఘటన. ఉదయం 9న్నర గంటల సమయంలో... పదేళ్ల పిల్లాడు... మారుతీ కారు నడుపుతూ కనిపించాడు. కారు వెనక సీట్లో అతని తల్లిదండ్రులే ఉన్నట్లు తెలిసింది. అసలే ఔటర్ రింగ్ రోడ్డుపై భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు... మైనర్ కి కారు స్టీరింగ్ ఎలా ఇస్తారన్నది ఆ తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి. పిల్లలు ఎదగాలనీ అన్నీ నేర్చేసుకోవాలని పేరెంట్స్ అనుకోవడం మంచిదే. కానీ... దేనికైనా ఓ వయసంటూ ఉంటుంది. రూల్స్ ఉంటాయి. వాటిని పాటించకపోతే మనకే ప్రమాదం.