చావు లేని జీవితాన్ని సృష్టించాలనే ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో శతాబ్దాల ముందు నుంచే చావు జయించాలని మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఇన్నాళ్లు మనిషిపై మరణానిదే పైచేయి అవుతూ వచ్చింది. అయితే ఇకపై అలా కాదు. ఎందుకంటే త్వరలోనే మరణం లేని మనిషిని సృష్టించబోతున్నట్టు సగర్వంగా ప్రకటించారు భారత శాస్త్రవేత్తలు. బతికినంత కాలం బతికి... కావాలనుకున్నప్పుడే చచ్చిపోవచ్చని చెబుతున్నారు ఇండియన్ సైంటిస్టులు.