తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం మరో యాప్ను పౌరుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. 'నా ఓటు' పేరుతో రిలీజ్ చేసిన యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు ఉపయోగపడేలా ఈ యాప్ రూపొందించడం విశేషం. ఇందులో ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు(ఈపీఐసీ) నెంబర్ను పేరుతో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అసలు ఆ యాప్ ఎలా వాడాలో వీడియోలో చూడండి.