హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Video : ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ

టెక్నాలజీ09:53 AM May 22, 2019

ISRO : అంతరిక్ష ప్రయోగాల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ - ఇస్రో... మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉదయం 5.30కి PSLV-C46 రాకెట్ ద్వారా... రీశాట్-2బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి... కక్ష్యలో ప్రవేశపెట్టింది. 615 కేజీల బరువున్న రీశాట్-2బీ... అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. దీన్ని ఆకాశంలో ఇస్రో కన్నుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులపై అనుక్షణం కన్నేస్తూ ఉగ్రవాద శిబిరాలు, వాది కదలికలను పసిగట్టి ఫొటోలు పంపిస్తు్ంది. అలాగే దేశంలోని వ్యవసాయ, అటవీ రంగాల సమాచారంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో ఉపయోగపడనుంది. మేఘాలు ఉన్నా అన్ని వేళలా స్పష్టమైన ఫొటోలు తీసిపంపగలదు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇక భారతీయులు గర్వంగా చెప్పుకునే చంద్రయాన్-2కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 9 నుంచి 16లోపు చంద్రయాన్‌-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తిరుమలలో తెలిపారు. ఈ ప్రయోగం కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్న ఆయన... సెప్టెంబరు 6న చంద్రుడిపై చంద్రయాన్‌-2 రోవర్‌ దిగుతుందని వివరించారు. ఈ సంవత్సరం మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నట్లు తెలిపారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading