హోమ్ » వీడియోలు » టెక్నాలజీ

Chandrayaan-2 : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్...

జాతీయం14:51 PM July 13, 2019

ISRO Chandrayaan-2 : ఒకప్పుడు చందమామపై నీటి జాడలు ఉన్నాయని చంద్రయాన్-1 ఉపగ్రహం ద్వారా కనిపెట్టిన ఇస్రో... ఇప్పుడు చందమామ దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెడుతూ... చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 15న చేపట్టబోతోంది. ఆ రోజు తెల్లవారు జామున 2.51 గంటలకు... నెల్లూరు జిల్లాలోని... శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ సంస్థలోని రెండో ప్రయోగ వేదిక నుంచీ చంద్రయాన్-2 శాటిలైట్‌ని పంపబోతోంది. ఈ సందర్భంగా... ఇస్రో ఛైర్మన్ కె.శివన్... తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావాలని స్వామి వారిని వేడుకున్నారు. GSLV-Mark 3M 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం జరగబోతోంది. ఇప్పటికే ఓసారి రిహార్సల్ 100 శాతం సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. మరోసారి కూడా రిహార్సల్ చెయ్యాలని నిర్ణయించారు. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రకటిస్తారు. ఈ మిషన్ ద్వారా ఇస్రో... ఓ ఆర్బిటర్, రోవర్, ల్యాండర్‌ను చందమామపైకి పంపబోతోంది. ఆర్బిటర్‌లో రోవర్, ల్యాండర్‌ను అమర్చి... అది చందమామ కక్ష్యా మార్గంలోకి చేరిన వెంటనే... రోవర్... రెక్కలు తెరచుకుని... ల్యాండర్ సాయంతో... చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది. 15న యాత్ర మొదలుపెట్టి... ఐదు రోజుల తర్వాత... భూ నియంత్రిత చంద్రుడి కక్ష్యలోకి వస్తుంది. ఆ తర్వాత... 16 రోజుల పాటూ... కక్ష్యామార్గాన్ని వివిధ దశల్లో సెట్ చేస్తారు. ఆ తర్వాత 27 రోజుల పాటూ చందమామ చుట్టూ తిరుగుతుంది. ఆ టైంలో ఆర్బిటర్ నుంచీ విడిపోయే ల్యాండర్ చందమామవైపు పయనించి... సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ ధ్రువంపై వాలుతుంది. సోలార్ పవర్‌తో పనిచేస్తూ... పరిశోధనలు చేస్తుంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading