ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో పూటకో కొత్త తరహా ఛాలెంజ్ పుట్టుకొస్తూనే ఉంది. ఇదే క్రమంలో 'బాటిల్క్యాప్ ఛాలెంజ్' కూడా పుట్టుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడివే వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 'బాటిల్క్యాప్ ఛాలెంజ్'పై అదిరిపోయే వీడియో చేశాడు. తనదైన బ్యాటింగ్ స్టైల్లోనే ఛాలెంజ్‌ను పక్కాగా ఫినిష్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.