యూత్ ఒలింపిక్స్ 2018లో భారత యువ హాకీ జట్లు సంచలనం సృష్టించాయి. ఫైనల్ చేరిన బాలుర, బాలికల హాకీ జట్లు... ఆఖరాటలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నాయి. బాలుర జట్టు 2-4 తేడాతో మలేషియా చేతిలో ఓడిపోగా, బాలికల జట్టు ఆతిథ్య అర్జెంటీనాతో 1-3 తేడాతో ఓడారు. అయితే మూడోసారి యూత్ ఒలింపిక్స్ ఈవెంట్లో పాల్గొంటున్న భారత జట్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం...