రాజ్‌కోట్ టెస్ట్‌లో ఆరంగ్రేటం చేసిన ముంబై కుర్రాడు పృథ్వీషా... తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సచిన్ వారసుడిగా పేరొందిన పృథ్వీ... తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది... రికార్డ్ క్రియేట్ చేశాడు. 154 బంతుల్లో 19 ఫోర్లతో 134 పరుగులు నమోదు చేశాడు. అతిపిన్న వయసులో సెంచరీ కొట్టిన సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన పృథ్వీ... నెట్స్‌లో చెమటోడ్చి ప్రాక్టీస్ చేశాడు.