వెస్టిండీస్‌ను టెస్ట్, వన్డే, టీ20ల్లో క్లీన్‌స్వీప్ చేసిన భారత క్రికెట్ జట్టు, ఆసీస్ టూర్‌కు బయలు దేరి వెళ్లింది. ఇంగ్లండ్ టూర్లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియా టూర్లో ఇది కొనసాగించమని చెప్పాడు విరాట్ కోహ్లీ... ‘మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అందుకే మా మెయిన్ ఫోకస్ అంతా బ్యాటింగ్ పైనే పెట్టాలనుకుంటున్నాం. ముఖ్యంగా మేం మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే ఆసీస్‌ను వాళ్ల దేశంలో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...’ అని టూర్‌కు వెళ్లే ముందు మీడియా సమావేశంలో చెప్పాడు విరాట్ కోహ్లీ.