2015 మార్చి 26న మూడేళ్ల ప్రాయంలోనే ఆర్చరీ (విలువిద్య)లో అంతర్జాతీయ రికార్డును బ్రేక్ చేసింది చిన్నారి డాలీ శివానీ. ప్రస్తుతం ఒలింపిక్స్ మెడల్ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శివానీ 2015లో గంట వ్యవధిలో 200 పాయింట్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడామెకు ఏడున్నరేళ్లు. ఈ నాలుగున్నరేళ్లలో దేశంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అద్భుత విజయాలు అందుకుంది. ఆమెను ప్రపంచ ఆర్చరీ అసోసియేషన్ భవిష్యత్ ఒలింపియన్‌గా గుర్తించింది. 2015లో ఆర్చరీ ట్రయల్ ఈవెంట్లో మొత్తం 338 పాయింట్లతో అదరగొట్టిన శివానీ ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆర్చరీ ప్రపంచ రికార్డులు సైతం తన పాదాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఆర్చరీలో 12 మీటర్లు, 15 మీటర్లు, 18 మీటర్ల విభాగాల్లో శివానీ పలు రికార్డులను బ్రేక్ చేసింది. 2024లో ఒలింపిక్స్ మెడల్ సాధించి అన్నయ్య లెనిన్తో పాటు తన తల్లితండ్రులు, గురువులు, విజయవాడకు బహుమతిగా ఇస్తానంటోంది. మరి మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.