Virat Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను ఇండోర్లో కనిపించేసరికి ఒక్కసారిగా సందడి మొదలైంది. బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడలేదు. సెలెక్టర్లు తనకు విశ్రాంతి ఇచ్చారు. ఆ సిరీస్ ముగిసిన తర్వాత... మధ్యప్రదేశ్... ఇండోర్లో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. దీనికి టీమిండియా కెప్టెన్గా కోహ్లీయే ఉండనున్నాడు. ఈ బిజీ షెడ్యూల్లో కూడా విరాట్ కోహ్లీ సందడి చేశాడు. ఓ యాడ్ షూట్ కోసం బిచోళీ హప్సీ అనే ప్రాంతానికి వచ్చిన విరాట్... పిల్లలతో సరదాగా కలిసి క్రికెట్ ఆడాడు. ఇప్పుడా వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.