2018 యూత్ ఒలింపిక్స్లో 16 ఏళ్ల మను భకర్ చారిత్రాత్మక విజయం సాధించిన వీడియోను ఒలింపిక్స్ అధికారిక చానెల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బాలికల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భకర్ ప్రదర్శన ఎక్స్పెక్టేషన్స్కు మించినట్లుగా సాగింది. క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచే ఆకట్టుకున్న భారత షూటర్..ఫైనల్ రౌండ్లోనూ గురి తప్పకుండా షూట్ చేసింది. పాయింట్స్ టేబుల్ టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఈ విజయంతో ప్రతిష్టాత్మక యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయురాలిగా హిస్టరీ క్రియేట్ చేసింది.