భారత్ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా పుట్టినరోజున ఉత్తర్‌ప్రదేశ్ రంజీ క్రికెటర్లు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రంజీ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉన్న రైనాతో స్పెషల్‌గా బర్త్‌డే కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత సతీమణి ప్రియాంకా, కూతురు గ్రేసియాతో కలిసి సురేష్ రైనా తన 32వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రైనా టీమిండియాలో చోటు కోసం దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.