పుణ్యక్షేత్రం వారణాసిలో మరో చరిత్రాత్మక ఘట్టం జరిగింది. ఇక్కడి సంపూర్ణానంద సంస్కృత విద్యాలయాలు స్థాపించి... 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా... అసాధారణ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. వెటరన్ మహిళా క్రికెటర్ నీలూ మిశ్ర ప్రారంభించిన క్రికెట్ పోటీల్లో ప్లేయర్లు, అంపైర్లు కూడా ధోతీలను ధరించి క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్‌లకు సంస్కృతంలోనే కామెంట్రీ చెప్పడం మరో విశేషం. మొత్తం 5 జట్లు ఈ పోటీల్లో పాల్గొని 10 ఓవర్ల ఫార్మాట్లో ఆడాయి. దోతీ కుర్తాలతో వికెట్ల మధ్య పరుగులు, లౌడ్ స్పీకర్లలో ప్రతిధ్వనించిన సంస్కృత వ్యాఖ్యానం సరికొత్తగా అనిపించింది. సంస్కృత క్రికెట్ లీగ్‌గా ఈ టోర్నమెంట్ పేరు తెచ్చుకోవడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.