తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సరదాగా కర్రసాము చేశారు. మహిళలకు ఆత్మరక్షణ , ధైర్య సాహసాలు పెంపొందించేందుకు కర్రసాము లో పీహెచ్డీ చేసిన ఆకుల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పూర్తి భద్రత, స్వేచ్ఛ ఉందన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని కోరారు.