విరాట్ కొహ్లీ సారధ్యంలోని టీమిండియా టెస్ట్‌ల్లో అత్యుత్తమ విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో నెగ్గి టెస్ట్ ఫార్మాట్లో ఇన్నింగ్స్ పరంగా భారీ విజయం సాధించింది. రాజ్‌కోట్ టెస్ట్ విజయంతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.