టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు ఫిట్టెస్ట్ ప్లేయర్ కూడా. ఎప్పుడూ పూర్తి ఫిట్నెస్తో ఉండే విరాట్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ కోసం సమాయత్తమవుతున్నాడు. ఆసీస్‌తో టూర్ కోసం ఆస్ట్రేలియా చేరుకున్న కొహ్లీ...ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా హార్డ్ వర్కౌట్స్ చేస్తున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్న వీడియోను విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.