ఎంట్రీతోనే అదరగొట్టాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. టెస్ట్‌ల్లో మొదటి సెంచరీనే భారీ సిక్సర్‌తో పూర్తి చేసుకున్న ఈ యంగ్ డైనమేట్... ఆసీస్ పర్యటనలో టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. సుత్తితో బ్యాటుకి పంచ్‌లు ఇస్తూ మెరుగులు దిద్దుతున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినిచ్చి, పంత్‌కు చోటు కల్పించారు. దాంతో తన సత్తా ఏంటో నిరూపించడానికి దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు పంత్.