టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. అతి తక్కువ కాలంలో జట్టులో కీలక బౌలర్‌గా మారిన ఇర్ఫాన్... బ్యాటింగ్‌లోనూ రాణించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘టెస్టుల్లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క బౌలర్‌గా చెరిగిపోని రికార్డు కూడా ఇర్ఫాన్ పేరటి ఉంది. వన్డేల్లో నెం. 2, టెస్టుల్లో నెం. 5 ఐసీసీ ర్యాంకు సాధించిన ఈ ఆల్‌రౌండర్, 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో మూడు కీలక వికెట్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.