స్వప్న బర్మన్ పేరు 2018 ఏషియాడ్‌కు ముందు క్రీడాభిమానులకు పెద్దగా పరిచయం లేదు.కానీ ఎప్పుడో పశ్ఛిమ బెంగాల్లో పాఠ్యపుస్తకాల్లో మాత్రం స్వప్న బర్మన్ గురించి ఓ పాఠమే ఉంది. స్వప్న సాధించిన ఘనతలను ఓ పాఠ్యాంశంగా పొందుపరిచారు. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత్‌కు హెప్టాథ్లాన్‌లో తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా స్వప్న చరిత్రను తిరగరాసింది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఏషియాడ్ స్వర్ణంతో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది.