HOME » VIDEOS » Sports

VIDEO : ఏషియాడ్ స్వర్ణం‌తో సంబరపడిపోతున్న స్వప్న‌ బర్మన్

క్రీడలు15:56 PM August 31, 2018

ఏషియాడ్‌ మహిళల హెప్టథ్లాన్‌లో స్వర్ణపతకం నెగ్గిన స్వప్న బర్మన్ ప్రస్తుతం గాల్లో తేలిపోతోంది.ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో అనూహ్యంగా స్వర్ణ పతకం నెగ్గిన స్వప్న చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత న్యూస్ 18‌తో ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.హెప్టథ్లాన్‌లో పసిడి పతకం నెగ్గడం, ఏషియాడ్‌లో భారత్‌కు స్వర్ణం అందిచడం కలలా ఉందని...తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన కోచ్‌,సహాయక సిబ్బందికి స్వప్న కృతజ్ఞతలు చెప్పింది.ఫైనల్‌లో తాను విజయం సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని... గాయమైనా కానీ ఫైనల్‌లో బరిలోకి దిగి పతకం నెగ్గడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని సంబరపడిపోతూ చెప్పింది.

webtech_news18

Top Stories