ఆసియాకప్లో శ్రీలంక ఘోర పరాభవం కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన మాజీ కెప్టెన్ ఏంజోలో మాథ్యూస్కి మరో దెబ్బ తగిలింది. జట్టు సమిష్టి వైఫల్యానికి తనను బలిపశువు చేశారంటూ వాపోతూ బోర్డుకి లేఖ రాసిన మాథ్యూస్... ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్లో చోటు కోల్పోయాడు. టెస్టు సిరీస్లో మాత్రం మాథ్యూస్కి చోటు దక్కింది.