అమెరికన్ రైజింగ్ స్టార్ స్లొయాన్ స్టీఫెన్స్ జరుపుకున్న సంబరాలు ప్రస్తుతం టెన్నిస్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. యూ ఎస్ ఓపెన్ మూడో రౌండ్ మ్యాచ్‌లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకాను ఓడించిన ఆనందంలో స్టీఫెన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది.మ్యాచ్ నెగ్గిన క్షణాల్లో స్లోయాన్ ఆనందానికి అడ్డే లేదు.ప్రస్తుత అమెరికన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన స్లొయాన్ స్టీఫెన్స్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.