రష్యన్ టెన్నిస్ క్వీన్ మారియా షరపోవా 2019 సీజన్లో అంచనాలకు మించి రాణించాలని పట్టుదలతో ఉంది. షరాకు ప్రపంచంలోనే అత్యంత అందమైన టెన్నిస్ క్రీడాకారిణిగా పేరుంది. ఏజ్ పెరుగుతున్నా మారియా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. 31 ఏళ్ల షరపోవా ఫిట్‌గా ఉండటానాకి ప్రతీ రోజు రెండు గంటల పాటు వర్కౌట్స్ చేస్తుంది. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన షరపోవాకు ఉన్న క్రేజ్,పాపులారిటీ ప్రస్తుతం మరే ఇతర మహిళా క్రీడాకారిణికి లేదు.