ధోనీ సతీమణి సాక్షి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సాక్షి తన 30వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సంబరాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి పాటలు పాడుతూ ...డ్యాన్స్ చేస్తూ సాక్షి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ధోనీ,సాక్షి క్లోజ్ ఫ్రెండ్స్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరీ ఈ వేడుకల్లో సందడి చేశారు.